Sun Mar 15 2026 23:12:13 GMT+0530 (India Standard Time)
మరోసారి ఏబీ సస్పెన్షన్
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ను ప్రభుత్వం మరోసారి సస్పెండ్ చేసింది.

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ను ప్రభుత్వం మరోసారి సస్పెండ్ చేసింది. ఇటీవల ఆయనకు ప్రిింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా పోస్టింగ్ ఇచ్చింది. అయితే పరభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న కారణంతో మరోసారి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పోస్టింగ్ ఇచ్చి...
టీడీపీ ప్రభుత్వంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. వైసీపీ ప్రభుత్వం రాగానే ఆయనపై పలు అభియోగాలతో సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ చేసి రెండేళ్లు గడవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లి ఏబీ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం తిరిగి ఆయనను సస్పెండ్ చేసింది.
Next Story

