Fri Jan 17 2025 20:27:31 GMT+0000 (Coordinated Universal Time)
గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
డీఎస్సీ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గడువును ప్రభుత్వం పొడిగించింది
డీఎస్సీ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డీఎస్సీ దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. డీఎస్సీ కోసం దరఖాస్తు చేసుకునేందుకు రేపటితో ఫీజు చెల్లింపు గడువు ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
దరఖాస్తు చేసుకునే వారికి...
వాస్తవానికి రేపటితో దరఖాస్తుల సమర్పణ గడువు ముగియనుంది. సాంకేతిక సమస్యలు తల్తెత్తడంతతో నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం తాజాగా అప్లికేషన్ల గడువును మూడు రోజుల పాటు పొడిగించారు. దీంతో డీఎస్సీ దరఖాస్తు చేసుకునే వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Next Story