Wed Jan 28 2026 21:57:50 GMT+0000 (Coordinated Universal Time)
ఎవరిపై ఉమ్మేస్తారో త్వరలోనే తెలుస్తుంది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన లోపాయికారీ ఒప్పందంతో స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దిగాయన్నారు. కుప్పం లో ఫలితం ఎలా ఉన్నా ఎవరికి జరిగే నష్టం ఏమీ ఉండదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కుప్పంలో గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమితో చంద్రబాబు మతిభ్రమించిందన్నారు. కుప్పం ఎన్నికలకు ప్రజాస్వామ్య పరిరక్షణ కు సంబంధం ఏమిటని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిందని తెలిపారు.
ఇప్పటికే కాడి పడేసి...
టీడీపీ ఇప్పటికే కాడి పడేసిందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కుప్పంలో బెంగళూరు నుంచి టీడీపీ నేతలు ఓటు వేయించేందుకు తరలించారని ఆయన ఆరోపించారు. అసలు దొంగ ఓట్లు వేసేందుకు అవకాశమెక్కడుంటుందని ఆయన ప్రశ్నించారు. ఓటరు ఐడీ ఉంటేనే పోలింగ్ అధికారులు ఓటింగ్ కు అనుమతిస్తామని చెప్పారు. చంద్రబాబు ఇక నాటకాలు చాలించాలని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. ప్రభుత్వ పనితీరును చూసి ప్రజలు వైసీపీకి ప్రతి ఎన్నికల్లో పట్టం కడుతున్నారని ఆయన అన్నారు. ప్రజలు ఎవరి మొహం మీద ఉమ్మేస్తారో త్వరలో తెలుస్తుందన్నారు.
Next Story

