Sun Mar 15 2026 23:14:04 GMT+0530 (India Standard Time)
కొత్త డీజీపీ హెచ్చరిక... అలా చేస్తే?
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తానని ఏపీ డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డి అన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తానని ఏపీ డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డి అన్నారు. ఆయన ఈరోజు డీజీపీగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మాజీ డీజీపీ గౌతం సవాంగ్ నుంచి ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా రాజేంద్ర నాధ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు పోలీసులకు మధ్య స్నేహ పూర్వక వాతావరణం నెలకొనేలా చర్చలు తీసుకుంటామాని చెప్పారు.
ఫిర్యాదు అందిన వెంటనే....
ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకునే విధంగా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. పోలీసు స్టేషన్ లోకి దౌర్జన్యంగా ఎవరు లోపలికి ప్రవేశించి విధులను అడ్డుకుంటే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని రాజేంద్ర నాధ్ రెడ్డి హెచ్చరించారు. పార్టీలతో సంబంధం లేకుండా తీవ్రమైన చర్యలు ఉంటాయని రాజేంద్ర నాధ్ రెడ్డి తెలిపారు. ప్రజల సహకారంతోనే శాంతిభద్రతలను కాపాడగలమని ఆయన అభిప్రాయపడ్డారు.
Next Story

