Fri Dec 05 2025 19:55:14 GMT+0000 (Coordinated Universal Time)
వైవీ సుబ్బారెడ్డికి వైఎస్ షర్మిల వార్నింగ్.. మామూలుగా లేదుగా...?
వైసీపీ నేత, తన బాబాయి వైవీ సుబ్బారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు

వైసీపీ నేత, తన బాబాయి వైవీ సుబ్బారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో షర్మిల మీడియాతో మాట్లాడారు. తాను ముఖ్యమంత్రిని జగన్ రెడ్డి అని అనడం నచ్చడం లేదట అని ఆమె ఎద్దేవా చేశారు. అయితే జగన్ గారు అని పిలవడంలో తనకు ఎటువంటి అభ్యంతరం లేదని, అయితే తనకు ఏపీలో జరిగిన అభివృద్ధి గురించి వైవీ సుబ్బారెడ్డి సవాల్ విసిరారని, అలాగే అభివృద్ధి చూపించగలిగితే తాను దేనికైనా సిద్ధమని ప్రకటించారు. అభివృద్ధిని చూసేందుకు తాను ఎక్కడికి రావడానికైనా సిద్ధమని వైఎస్ షర్మిల అన్నారు.
టైం మీరు చెబుతారా? నేను చెప్పనా?
సమయం వైవీ సుబ్బారెడ్డి చెబితే ఆ టైంకు తాను వచ్చేందుకు సిద్ధమని వైఎస్ షర్మిల ప్రతి సవాల్ విసిరారు. టైం మీరు చెబుతారా? నన్ను చెప్పమంటారా? అంటూ వైవీకి ప్రతి సవాల్ విసిరారు. మనిద్దరితో పాటు మేధావులను తీసుకెళదామని, వారు అభివృద్ధి జరిగిందని ఒప్పుకుంటే తాను వైవీ చెప్పిన దేనికైనా సిద్ధమని వైఎస్ షర్మిల ప్రకటించారు. మీ మూడు రాజధానులు ఎక్కడో కూడా చూపించగలరా? అని ప్రశ్నించారరు. పోలవరం ప్రాజెక్టు పూర్తయిందా? అని నిలదీశారు.
Next Story

