Sun Feb 01 2026 23:00:52 GMT+0000 (Coordinated Universal Time)
ఏప్రిల్ 2న ఏపీ కేబినెట్ విస్తరణ
జగన్ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం నిర్ణయించారు. ఏప్రిల్ 2వ తేదీన కొత్త మంత్రివర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు

జగన్ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం నిర్ణయించారు. ఏప్రిల్ 2వ తేదీన కొత్త మంత్రివర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మార్చి 27వ తేదీన ప్రస్తుతం ఉన్న మంత్రి వర్గ సభ్యులు విస్తరణకు సహకరిస్తూ రాజీనామా చేయనున్నారు. ఏప్రిల్ 2వ తేదీన ఉగాది కావడంతో ఆ రోజు కొత్త మంత్రివర్గ సభ్యుల చేత ప్రమాణస్వీకారం చేయించాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అందరూ రాజీనామా....
ఈ మేరకు మంత్రులు ఈ నెల 27వ తేదీన రాజీనామా చేయాలని మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. ఉన్న మంత్రులందరూ రాజీనామా చేస్తారని, పాతవారిలో కొందరిని తిరిగి కేబినెట్ లోకి తీసుకున్నా వారిచేత మరోసారి ప్రమాణస్వీకారం చేయిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గం మొత్తం రాజీనామా చేయాలని జగన్ నిర్ణయించారు. ఈసారి కూడా ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటారు.
Next Story

