Mon Jan 13 2025 09:23:36 GMT+0000 (Coordinated Universal Time)
మీరు త్వరగా కోలుకోవాలి చంద్రబాబు గారు - సీఎం వైఎస్ జగన్
చంద్రబాబుకు కరోనా సోకడంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. మీరు త్వరగా
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాగా.. చంద్రబాబుకు కరోనా సోకడంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.
Also Read : భారీ భూకంపం.. 25 మంది మృతి
మీరు త్వరగా కోలుకుని, పూర్తి ఆరోగ్యవంతులవ్వాలని కోరుకుంటున్నానంటూ.. చంద్రబాబు నాయుడిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు జగన్. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. చంద్రబాబు నాయుడికన్నా ముందు.. కొడుకు నారా లోకేష్ కు పాజిటివ్ గా తేలింది. ఇప్పుడు చంద్రబాబు కు కూడా పాజిటివ్ గా నిర్థారణ అవ్వడంతో..ఇద్దరూ ఇంట్లోనే ఐసోలేట్ అయి, చికిత్స తీసుకుంటున్నారు.
Next Story