Sun Mar 22 2026 07:57:49 GMT+0530 (India Standard Time)
ఈ నెల 17న విశాఖకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 17న విశాఖపట్నం పర్యటన చేయనున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 17న విశాఖపట్నం పర్యటన చేయనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఎన్ఏడీ వద్ద ఫ్లై ఓవర్ కు ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
వివాహ రిసెప్షన్ లో....
అనంతరం విజయనగరంలో ఒక ఫంక్షన్ లోనూ, విశాఖలో జరగనున్న వెంకయ్య నాయుడు మనవరాలి వివాహ రిసెప్షన్ లోనూ ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటారు. అనంతరం అదే రోజు సాయంత్రం విశాఖ నుంచి తాడేపల్లి కి చేరుకుంటారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి
Next Story

