Sat Mar 21 2026 11:10:37 GMT+0530 (India Standard Time)
నేడు శ్రీసత్యసాయి జిల్లాకు జగన్
నేడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. పంట బీమా సొమ్మును రైతు ఖాతాల్లో జమ చేయనున్నారు

నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. పంట బీమా సొమ్మును రైతు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి కార్యాలయం నుంచి బయలుదేరి శ్రీ సత్యసాయి జిల్లాకు 10.30 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి చెన్నే కొత్తపల్లి గ్రామానికి చేరుకుని అక్కడ జరిగి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
ఖరీఫ్ లో పంట నష్టపోయిన...
2021 ఏడాదిలో ఖరీఫ్ పంట నష్టపోయిన 1561 మంది రైతుల ఖాతాల్లో డబ్బుల్ని బటన్ నొక్కి జమ చేయయనున్నారు. 2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని రైతులకు అందజేస్తారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. కొందరి రైతులకు చెక్కులను అందచేయనున్నేారు. మధ్యాహ్నం 1గంటలకు తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లాలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story

