Sun Mar 15 2026 15:44:33 GMT+0530 (India Standard Time)
నేడు నంద్యాలకు జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు నంద్యాలలో పర్యటించనున్నారు. జగనన్న వసతి దీవెన రెండో విడత నిధులను విడుదల చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు నంద్యాలలో పర్యటించనున్నారు. జగనన్న వసతి దీవెన రెండో విడత నిధులను విడుదల చేయనున్నారు. అనంతరం నంద్యాలలో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
రెండో విడత వసతి దీవెన...
జగనన్న రెండో విడత వసతి దీవెన పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 1,024 కోట్ల రూపాయల నగదును జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా 10,68,150 మంది లబ్ది పొందనున్నారు. జగన్ నంద్యాల పర్యటనకు సంబంధించి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Next Story

