Thu Mar 19 2026 07:04:14 GMT+0530 (India Standard Time)
రేపు తూర్పు గోదావరి జిల్లాకు జగన్
ఏపీ సీఎం జగన్ రేపు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత ప్రాంతాలను జగన్ పరిశీలిస్తారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత ప్రాంతాలను జగన్ పరిశీలిస్తారు. అక్కడ నిర్వాసితులతో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడతారు. పోలవరం ప్రాజెక్టును కూడా సందర్శిస్తారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ కూడా పోలవరం పర్యటనకు రానున్నారు. కేంద్ర మంత్రి పోలవరం ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష చేయనున్నారు.
పోలవరం ప్రాజెక్టుకు....
కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ తో పాటు జగన్ కూడా పోలవరం ప్రాజెక్టు పరిశీలనలో పాల్గొంటారు. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధుల కోసం ప్రభుత్వం నిత్యం కేంద్ర ప్రభుత్వంతో పోట్లాడుతూనే ఉంది. జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టు కావడంతో కేంద్రం ఇచ్చే నిధులు వెనువెంటనే ఇవ్వాలని కోరుతుంది. కేంద్రమంత్రితో జగన్ రేపు భేటీ అయి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పలు అంశాలపై చర్చిస్తారు.
Next Story

