Sun Mar 22 2026 06:30:29 GMT+0530 (India Standard Time)
ఐదు గంటలు జగన్ విశాఖలోనే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విశాఖ వెళ్లనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విశాఖ వెళ్లనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు. జగన్ ఈరోజు సాయంత్ర 4.10 గంటలకు వివాఖ పట్టణానికి బయలుదేరి వెళతారు. అక్కడ ఎన్ఏడీ జంక్షన్ లోని ఫ్లఓవర్ ను ప్రారంభించనున్నారు. వాటితో పాటు విశాఖ మెట్రో రీజనల్ డెవలప్ మెంట్ అధారిటీ ఆధ్వర్యంలో మరో ఆరు ప్రాజెక్టులను జగన్ ప్రారంభిస్తారు.
పలు అభివృద్ధి కార్యక్రమాలను....
అనంతరం విజయనగరం జిల్లా డీసీసీబీ ఛైర్మన్ నెక్కల నాయుడు కుమార్తె వివాహ వేడుకకు హాజరవుతారు. అక్కడి నుంచి ఉడాపార్కు వద్ద మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చేసిన మరో నాలుగు ప్రాజెక్టులను జగన్ ప్రారంభిస్తారు. అక్కడ నుంచి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవవరాలి వివాహ రిసెప్షన్ కు హాజవుతారు. అక్కడ నుంచి తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. దాదాపు ఐదు గంటల పాటు జగన్ విశాఖపట్నంలో ఉండనున్నారు.
Next Story

