Fri Mar 20 2026 11:29:21 GMT+0530 (India Standard Time)
ఆదాయం పెంచుకోవడమెలా?
రాష్ట్రానికి అదనపు ఆదాయం కోసం ఏం చేయాలన్న దానిపై అధికారులతో జగన్ సమీక్షించారు.

ముఖ్యమంత్రి జగన్ వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి అదనపు ఆదాయం కోసం ఏం చేయాలన్న దానిపై అధికారులతో జగన్ సమీక్షించారు. అదనపు ఆదాయం కోసం ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై అథ్యయనం చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. సొంతంగా ఆదాయం కోసం ప్రజలపై పన్నుల భారం వేయకుండా ఏం చేయాలన్న దానిపై కసరత్తు చేయాలని ఆదేశించారు.
కలెక్టర్లదే కీలక పాత్ర....
అయితే ఆదాయాన్ని పెంచుకోవడానికి కలెక్టర్లు క్రియాశీలకంగా వ్యవహరించాలని జగన్ ఆదేశించారు. రాబడులను పెంచుకోవడానికి ఏ యే మార్గాలను అనుసరించాలో అన్వేషించాలని కోరారు. విచక్షణాధికారాలను వినియోగించి ఆదాయ మార్గాలను పెంచుకునే ఐడియాలు ఇవ్వాలని జగన్ అధికారులను కోరారు. దీంతో రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు అధికారులు వివిధ మార్గాలను సూచించినట్లు తెలుస్తోంది.
Next Story

