Tue Jun 06 2023 12:45:58 GMT+0000 (Coordinated Universal Time)
తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు : సీఎం జగన్
నేటితో ముగిసి, రేపటి నుంచి శోభకృతు నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరికీ..

తెలుగు ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శుభకృతు నామ సంవత్సరం నేటితో ముగిసి, రేపటి నుంచి శోభకృతు నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ కొత్త సంవత్సరంలో రాష్ట్రప్రజలందరికీ శుభం జరగాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వానలు కురిసి, రైతులకు మేలు జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో, నవ్వులతో కళకళలాడాలని, మన సంస్కృతి వెల్లివిరియాలని సీఎం పేర్కొన్నారు.
Next Story