Fri Mar 20 2026 09:17:11 GMT+0530 (India Standard Time)
సీఎం జగన్ కు అనారోగ్యం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనారోగ్యం పాలయ్యారు. ఆయనకు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనారోగ్యం పాలయ్యారు. ఆయనకు వైరల్ ఫీవర్ సోకడంతో బలహీనంగా ఉన్నారని మీడియా సంస్థలు తెలిపాయి. ఈరోజు ఆయన కేబినెట్ భేటీలో పాల్గొన్నారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశాలన్నీ పూర్తయ్యాక సీఎం జగన్ విశ్రాంతి తీసుకున్నారు. మధ్యాహ్నం తర్వాత సీఎం జగన్ ను కలిసేందుకు ఇచ్చిన అపాయింట్మెంట్లన్నీ రద్దు చేశారు.
కేబినెట్ భేటీ సమయంలోనే సీఎం జగన్ ఆరోగ్యం సరిగా లేదని అన్నారు. జలుబు, దగ్గు కూడా ఉండటంతో వైరల్ ఫీవర్ గా గుర్తించారు. వైద్యుల సలహా మేరకు మెడికేషన్ ప్రారంభించారు. కాస్త విశ్రాంతి తీసుకోాలని సూచించారు. ఈ కారణంగానే అపాయింట్మెంట్లను రద్దు చేశారు. గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉండగా.. ఈ సమావేశాలకు ఆయన హాజరవుతారా లేదా అనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు హయాలో జరిగిన స్కాముల గురించి ఆయన వివరించే అవకాశం ఉంది.
Next Story

