Sat Dec 06 2025 02:55:36 GMT+0000 (Coordinated Universal Time)
పీఆర్సీ ఒక్కటే కాదు.. ఇంకా చాలా ఉన్నాయ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పీఆర్సీపై కీలక ప్రకటన చేశారు. పదిరోజుల్లో ప్రకటిస్తామని తిరుపతిలో ఆయన చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పీఆర్సీపై కీలక ప్రకటన చేశారు. పదిరోజుల్లో ప్రకటిస్తామని తిరుపతిలో ఆయన చెప్పారు. అయితే దీనిపై ఉద్యోగ సంఘాలు మాత్రం తమ డిమాండ్లలో పీఆర్సీ అనేది ఒకటేనని, మొత్తం 55 సమస్యలున్నాయని ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉన్నారు. పీఆర్సీని పదిరోజుల్లో ప్రకటిస్తామని సీఎం చెప్పడాన్ని ఆహ్వానిస్తున్నామని, అయితే అదే సమయంలో మిగిలిన సమస్యల సంగతి కూడా తేల్చాలని డిమాండ్ చేశారు.
అన్ని సమస్యలు...
తమ సమస్యలన్నీ పరిష్కారం అయ్యేంత వరకూ తమ ఉద్యమం కొనసాగుతుందని ఆయన చెప్పారు. పీఆర్సీని ప్రకటించే ముందు దశలు వారీగా చర్చలు జరగాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మిగిలిన డిమాండ్ల సంగతిని కూడా తేల్చాలని వారు కోరుతన్నారు.
Next Story

