Thu Apr 02 2026 22:00:53 GMT+0530 (India Standard Time)
జగన్ తీపి కబురు.. పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో యువతకు గుడ్ న్యూస్ చెప్పారరు. గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో యువతకు గుడ్ న్యూస్ చెప్పారరు. గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. ఏపీలో గ్రూప్ 1, 2 పోస్టులకు సంబంధించి గతంలో జాబ్ క్యాలెండర్ లో ప్రకటించిన వాటి కంటే ఎక్కువ పోస్టులకు ముఖ్యమంత్రి జగన్ ఆమోదం తెలిపారు. గతంలో జాబ్ క్యాలెండర్ లో గ్రూప్ 1, 2 పోస్టులను 36 వేలు అని పేర్కొన్నారు.
సంఖ్యను పెంచి...
అయితేే ఇప్పుడు ఆ సంఖ్యకు మరో మూడు వందలు పెంచారు గ్రూపు 1 లో డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీవో, సీటీవో, డీఎససీ, డీఎఫ్ఓ, మున్సిపల్ కమిషనర్లు వంటి పోస్టులుంటాయి. గ్రూపు 2 లో డిప్యూటీ తాహసిల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు, ట్రెజరీ పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించి త్వరలోనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనుంది.
Next Story

