Thu Mar 19 2026 07:05:56 GMT+0530 (India Standard Time)
తూర్పు ఏజెన్సీలో నేడు జగన్ పర్యటన
ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు పోలవరం ప్రాజెక్టు వద్ద పర్యటించనున్నారు. కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ తో కలసి పర్యటిస్తారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు పోలవరం ప్రాజెక్టు వద్ద పర్యటించనున్నారు. కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ తో కలసి పర్యటిస్తారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం నిర్మించిన పునరావాస కాలనీలను జగన్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా జగన్ నిర్వాసితులతో మాట్లాడతారు. ఉదయం పదిగంటలకు దేవీపట్నం మండలంలోని ఆర్అండ్ఆర్ కాలనీకి చేరుకుని అక్కడి నుంచి ఇందుకూరుపేట పునరావాస కాలనీకి చేరుకుంటారు
కేంద్రమంత్రితో కలసి...
అక్కడ నిర్వాసితులతో మాట్లాడిన అనంతరం 11 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరి పశ్చిమ గోదావరి జిల్లాకు వెళతారు. తూర్పు ఏజెన్సీలో ముఖ్యమంత్రి జగన్, కేంద్ర మంత్రి పర్యటిస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కావడంతో నిన్నటి నుంచే ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.
Next Story

