Sat Dec 06 2025 16:14:21 GMT+0000 (Coordinated Universal Time)
రెండ్రోజులు కడపలో పర్యటించనున్న సీఎం జగన్
ఏప్రిల్ 15,16 తేదీల్లో ఒంటిమిట్టలో జరగనున్న కోందడరాముని కల్యాణ మహోత్సవానికి జగన్ హాజరు కానున్నారు. 15వ తేదీన ఒంటిమిట్టలో..

కడప : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండ్రోజులపాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 15,16 తేదీల్లో ఒంటిమిట్టలో జరగనున్న కోందడరాముని కల్యాణ మహోత్సవానికి జగన్ హాజరు కానున్నారు. 15వ తేదీన ఒంటిమిట్టలో జరిగే స్వామివారి కల్యాణంలో పాల్గొంటారు. అనంతరం కడపకు చేరుకుని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ లో బస చేస్తారు.
16వ తేదీ ఉదయం 9 గంటలకు స్థానిక ఎన్జీఓ కాలనీలో జరిగే ఐఏఎస్ అధికారి మౌర్య వివాహానికి హాజరవుతారు. అనంతరం ఆదిత్య కల్యాణ మండపంలో జరిగే మేయర్ సురేష్ బాబు కుమార్తె ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ లో పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం కడప విమానాశ్రయానికి చేరుకుని కర్నూల్ జిల్లాకు వెళ్లనున్నారు.
Next Story

