Tue Jan 20 2026 06:20:15 GMT+0000 (Coordinated Universal Time)
గౌతమ్ అనేక సార్లు నాకు అండగా నిలిచాడు
మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి తనకు వ్యక్తిగతంగా తీరని లోటని సీఎం జగన్ అన్నారు. తనకు అనేక సార్లు గౌతమ్ అండగా నిలిచారన్నారు

మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి తనకు వ్యక్తిగతంగా తీరని లోటని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. తనకు అనేక సందర్భాల్లో గౌతమ్ అండగా నిలిచారన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా గౌతమ్ రెడ్డి చేసేవారన్నారు. గౌతమ్ రెడ్డి కృషి కారణంగానే రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటయ్యాయయని జగన్ చెప్పారు. ఆయన మృతి తనకు మాత్రమే కాదు పార్టీకి, ప్రభుత్వానికి కూడా లోటని జగన్ ఆవేదన చెందారు.
సంగం బ్యారేజీకి గౌతమ్ పేరు....
సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును పెడుతున్నామని జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. మేకపాటి గౌతమ్ రెడ్డికి శాసనసభ నివాళులర్పించింది. ఆయన అనుకున్న లక్ష్యాలను, కలలను తాను నెరవేరుస్తానని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఉదయగిరికి నీటిని తెస్తామని జగన్ తెలిపారు. సంగం బ్యారేజీ పనులు ఆరు వారాల్లోగా పూర్తి చేస్తామని జగన్ తెలిపారు. ఒక మంచి స్నేహితుడిని కోల్పోయానని జగన్ చెప్పారు.
Next Story

