Tue Mar 17 2026 11:40:39 GMT+0530 (India Standard Time)
ప్రధాని మోదీతో జగన్ భేటీ
ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు.

ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ముఖ్యమంత్రి జగన్ ఈ సందర్భంగా కోరారు. ఆంధ్రప్రదేశ్ ను ఆర్థికంగా చేయూతనందించేందుకు సహకరించాలని జగన్ ప్రధానిని కోరారు. విభజన హామీలను నెరవేర్చాలని కూడా జగన్ కోరారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేందుకు నిధుల విడుదల విషయంలో కేంద్ర ప్రభుత్వం పెద్దమనసు చేసుకుని సహకరించాలని కోరారు.
కీలక అంశాలపై....
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలను ఆమోదించాలని జగన్ ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. రెవెన్యూ గ్యాప్ ను కూడా విడుదల చేయాలని జగన్ కోరినట్లు తెలసింది. ఇక వీటన్నింటితో పాటు ప్రత్యేక హోదా అంశాన్ని కూడా పరిశీలించాలని కోరారు. ఈ మేరకు ఏపీ అభివృద్ధి కోసం జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి వినతి పత్రాన్ని అందించారు.
Next Story

