Sun Mar 22 2026 06:27:57 GMT+0530 (India Standard Time)
నేడు విశాఖకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విశాఖ పర్యటనకు వెళుతున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో జగన్ పాల్గొంటారు.

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విశాఖ పర్యటనకు వెళుతున్నారు. విశాఖలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో జగన్ పాల్గొంటారు. ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ముఖ్యమంత్రి జగన్ విశాఖపట్నంకు చేరుకుంటారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా నావల్ డాక్ యార్డుకు చేరుకుంటారు.
వివిధ కార్యక్రమాల్లో....
నావల్ డాక్ యార్డులో జరిగే వివిధ కార్యక్రమాల్లో జగన్ పాల్గొంటారు. తర్వాత ఐఎన్ఎస్ వేలా సబ్ మెరైన్ ను జగన్ సందర్శిస్తారు. అక్కడి నుంచి సర్క్యూట్ గెస్ట్ హౌస్ కు వెళ్లి కొద్ది సేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం 53.0 గంటలకు ఆర్కే బీచ్ లో జరిగే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగిస్తారు. తిరిగి రాత్రి 7.15 గంటలకు విశాఖపట్నం ఎయిర్ పోర్టు నుంచి బయలదేరుతారు
Next Story

