Thu Apr 02 2026 22:01:10 GMT+0530 (India Standard Time)
దిశ వాహనాలను ప్రారంభించిన జగన్
ఆంధ్రప్రదేశ్ లో దిశ పెట్రోలింగ్ వాహనాలను ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. 163 దిశ వాహనాలను జగన్ ప్రారంభించారు

ఆంధ్రప్రదేశ్ లో దిశ పెట్రోలింగ్ వాహనాలను ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. 163 దిశ పెట్రోలింగ్ వాహనాలను జగన్ ప్రారంభించారు. మహిళల రక్షణ కోసమే ఈ వాహనాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. అసెంబ్లీ ప్రాంగణంలో జగన్ వీటిని ప్రారంభించారు. రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని జగన్ హెచ్చరించారు. ఇప్పటికే 1.16 కోట్ల మంది మహిళలు దిశ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారని జగన్ చెప్పారు.
నిమిషాల్లో చేరుకునేలా....
ప్రమాదం జరిగిన వెంటనే పట్టణాల్లో అయితే నాలుగు నుంచి ఐదు నిమిషాల్లో, గ్రామాల్లో అయితే ఎనిమిది నుంచి పదినిమిషాల్లో సిబ్బంది చేరుకునేలా చర్యలు తీసుకున్నామని జగన్ చెప్పారు. దిశ పోలీస్ స్టేషన్లలో 900 ద్విచక్ర వాహనాలున్నాయన్నారు. వీటికి అదనంగా మరో మూడు వేలకు పైగా ఎమెర్జెన్సీ వాహనాలను ప్రారంభిస్తామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు తక్షణ రక్షణ కల్పించేందుకు ఈ వాహనాలు ఉపయోగపడతాయని చెప్పారు.
Next Story

