Mon Mar 16 2026 19:23:26 GMT+0530 (India Standard Time)
జగన్ అక్రమాస్తుల కేసు : గడువు కోరిన సీబీఐ
తనకు సీబీఐ కేసుల నుంచి విముక్తి కల్పించాలంటూ జగన్ గతంలో దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ పై సీబీఐ స్పందించింది.

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అభియోగాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తనకు సీబీఐ కేసుల నుంచి విముక్తి కల్పించాలంటూ జగన్ గతంలో దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ పై సీబీఐ స్పందించింది. జగన్ వేసిన పిటిషన్ కు సమాధానమివ్వాల్సిన విచారణ అధికారి ప్రస్తుతం ఢిల్లీలో శిక్షణ పొందుతున్నారని, అందుకే సకాలంలో కౌంటర్ దాఖలు చేయలేకపోయామని సీబీఐ ప్రత్యేక కోర్టుకు తెలిపింది. ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు మరింత గడువు కావాలని కోరింది సీబీఐ. సీబీఐ వాదనను పరిగణలోకి తీసుకున్న ప్రత్యేక కోర్టు.. కేసు విచారణను వాయిదా వేసింది.
Next Story

