Sat Mar 07 2026 21:57:13 GMT+0530 (India Standard Time)
రఘురామ ఇంటికి ఏపీ పోలీసులు?
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు చేరుకున్నారు.

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు చేరుకున్నారు. గచ్చిబౌలిలో ఉన్న ఆయన ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు వచ్చారు. గత కేసులకు సంబంధించి ఆయనను విచారణకు రావాల్సిందిగా సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది.
గతకేసు విషయంలో...
రఘురామ కృష్ణరాజుపై గతంలో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆయనను అరెస్ట్ కూడా చేశారు. అయితే రఘురామ కృష్ణరాజు బెయిల్ పై బయటకు వచ్చారు. ఆ కేసు విచారణకు సంబంధించి మరోసారి విచాణకు రావాల్సిందిగా రఘురామకృష్నరాజుకు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారని సమాచారం.
Next Story

