Sun Mar 15 2026 18:00:54 GMT+0530 (India Standard Time)
ఎంపీ రఘురామకు ఏపీ సీఐడీ నోటీసులు
నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజుకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది

నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజుకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈరోజు దిల్కుషాలో జరిగే విచారణకు హాజరుకావాలని నోలీసుల్లో పేర్కొన్నారు. మూడు రోజుల పాటు జరిగే విచారణకు హాజరు కావాలని ఏపీ సీఐడీ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే తాను సీఐడీ నోటీసులకు సమాధానమిచ్చానని రఘురామ కృష్ణరాజు తెలిపారు.
సమాధానం ఇలా....
కోర్టు ఆదేశాలను పాటించకుండా తనకు నోటీసులు ఇవ్వడంపై తాను అభ్యంతరం తెలిపానని ఆయన చెప్పారు. తనతో పాటు మరో ఇద్దరిని విచారించాలని కోర్టు పేర్కొన్నప్పటికీ తన ఒక్కడికే నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. తనతో పాటు రెండు ప్రముఖ ఛానళ్లకు కూడా నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశాలున్నాయన్నారు. ఇది కోర్టు థిక్కరణ కిందకు వస్తుందని ఆయన ఏపీ సీఐడీకి పంపిన వివరణలో పేర్కొన్నారు.
Next Story

