Sun Mar 15 2026 19:22:14 GMT+0530 (India Standard Time)
గౌతు శిరీషకు సీఐడీ నోటీసులు
తెలుగుదేశం పార్టీ నాయకురాలు గౌతు శిరీషకు సీఐడీ నోటీసులు జారీ చేసింది.

తెలుగుదేశం పార్టీ నాయకురాలు గౌతు శిరీషకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. అమ్మవడి, వాహనమిత్ర పథకాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని ప్రభుత్వ చిహ్నంతో సోషల్ మీడియలో పోస్టు చేసినందుకు ఆమెకు ఈ నోటీసులు జారీ చేసింది. ఇటీవల అమ్మఒడి, వాహన మిత్ర పథకాలను ప్రభుత్వం నిధుల లేని కారణంగా రద్దు చేసిందని, 2022 సంవత్సరానికి ఈ పథకాల కింద లబ్దిదారులకు సొమ్ములు అందవంటూ ప్రభుత్వ ప్రకటన మాదిరి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
విచారణకు హాజరవుతా....
అయితే దీనిపై పలాస టీడీపీ ఇన్ ఛార్జి గౌతు శిరీషకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6వ తేదీన సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సీఆర్పీసీ సెక్షన్ 41ఎ ప్రకారం నోటీసులు ఇచ్చారు. అయితే తాను విచారణకు హాజరయి వివరణ ఇస్తానని గౌతు శిరీష తెలిపారు.
Next Story

