Sun Feb 01 2026 07:41:59 GMT+0000 (Coordinated Universal Time)
జీతాలు పెరిగాయి... అపోహలు వీడండి
కొత్త పీఆర్సీతో ఉద్యోగుల జీతాలు పెరిగాయని ఏపీ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ తెలిపారు

కొత్త పీఆర్సీతో ఉద్యోగుల జీతాలు పెరిగాయని ఏపీ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ తెలిపారు. ఆయన ఉద్యోగుల పే స్లిప్ లను కొన్ని విడుదల చేశారు. సమ్మె వల్ల ఉద్యోగులకు నష్టమే తప్ప లాభమేదీ లేదని సమీర్ శర్మ స్పష్టం చేశారు. సమ్మెకు వెళ్లకుండా ఉద్యోగులు సంయమనం పాటించాలని సమీర్ శర్మ కోరారు. వేతనాలు పెరుగుతున్నాయని ఉద్యోగులు తెలుసుకోవాలని ఆయన కోరారు. అపోహలు వీడి ఆందోళనలను విరమించాలని కోరారు.
చర్చల ద్వారానే సాధ్యం....
తమ సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని సమీర్ శర్మ సూచించారు. పరిస్థితిని చేయి జారి పోకుండా చూసుకోవాల్సిన బాద్యత ఉద్యోగుల పైనే ఉందని చెప్పారు. వారు ముందుకు వస్తే వారి సందేహాలను తీర్చడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని సమీర్ శర్మ చెప్పారు.
Next Story

