Thu Mar 19 2026 04:28:15 GMT+0530 (India Standard Time)
రేపు కడప జిల్లాకు జగన్?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటించనున్నారు. భారీ వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో గురువారం కడప జిల్లాకు వెళ్లాలని జగన్ నిర్ణయించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా కడప, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ నష్టం సంభవించిన సంగతి తెలిసిందే. పునరావాస శిబిరాల నుంచి బాధితులు ఇప్పుడిప్పుడే ఇంటికి చేరుకుంటున్నారు.
నేరుగా బాధితులతో....
దీంతో ముఖ్యమంత్రి జగన్ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించారు. బాగా దెబ్బతిన్న ప్రాంతాలను జగన్ పరిశీలించనున్నారు. బాధితులతో నేరుగా సమావేశం కానున్నారు. జగన్ పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు విపక్షాలు నిరసన తెలియజేయడానికి సిద్ధమయ్యాయి.
Next Story

