Thu Mar 26 2026 02:58:57 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రేపు ఢిల్లీకి జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం ప్రధాని నరేంద్రమోదీతో జగన్ సమావేశం కానున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఎల్లుండి ఉదయం పది గంటలకు ప్రధాని నరేంద్రమోదీతో జగన్ సమావేశం కానున్నారు. రాష్ట్ర సమస్యలపై ఆయన చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్టు నిధులతో పాటు ఏపీకి రావాల్సిన వివిధ ప్రాజెక్టులపై జగన్ వినతి పత్రాన్ని సమర్పించనున్నారు. రేపు రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు. ఎల్లుండి కూడా ఢిల్లీలో జగన్ పర్యటన ఉంటుంది.
కేంద్ర మంత్రులను....
జగన్ ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను కలిసే అవకాశం కూడా ఉంది. అందుబాటులో ఉన్న మంత్రుల అపాయింట్ మెంట్ కోసం జగన్ బృందం ప్రయత్నిస్తుంది. దీంతో పాటు కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలను కలసి వారిని అభినందిస్తారు. మర్యాదపూర్వకంగా వారిని కలుస్తారు. ఎల్లుండి తిరిగి ఢిల్లీ నుంచి బయలు దేరి తాడేపల్లికి చేరుకుంటారు.
Next Story

