Tue Jan 21 2025 19:42:58 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : ఎల్లుండి వైఎస్సార్ చేయూత నిధుల విడుదల.. కుప్పంలో
వైఎస్సార్ చేయూత నాలుగో విడత నగదు పంపిణీని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 21వ తేదీన చేపట్టనున్నారు
వైఎస్సార్ చేయూత నాలుగో విడత నగదు పంపిణీ ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 21వ తేదీన చేపట్టనున్నారు. మహిళల ఖాతాల్లోకి 18,750 రూపాయలు బటన్ నొక్కి డబ్బులు జమ చేయనున్నారు. గత మూడేళ్లలో రూ. 666.50 కోట్ల నిధులు చేయూత కింద జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాల్గొని బటన్ నొక్కి నిధులను విడుదల చేయనున్నారు.
ఈ పధకం ద్వారా....
వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ప్రతి సంవత్సరం వైఎస్సార్సీపీ ప్రభుత్వం 18,750 రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది. ఇప్పటి వరకు మూడు సార్లు సాయం అందించింది. నాలుగో విడత గతేడాదే విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. మొదట ఫిబ్రవరి 5న వైఎస్సార్ చేయూత నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ అది ఫిబ్రవరి 16కు వాయిదా పడింది. కాగా ఈ తేదీని కూడా ఫిబ్రవరి 21కి ప్రభుత్వం మార్చింది.
Next Story