Tue Mar 24 2026 06:28:57 GMT+0530 (India Standard Time)
గడప గడపకు పై రేపు సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేల పనితీరును ఆయన మదింపు చేయనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వద్దకు ఎమ్మెల్యేలు, మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్టులున్నాయి. ఎవరెవరు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు? ఎంతమంది గెలుపుకు దగ్గరగా ఉన్నారన్న దానిపై సర్వే నివేదికలు స్పష్టంగా ఉన్నాయి.
ఇదే ఫైనల్...
దీంతో రేపటి సమావేశంలో జగన్ ఏ ఏ ఎమ్మెల్యేల పేర్లు ప్రకటిస్తారన్న టెన్షన్ అందరిలోనూ నెలకొంది. మధ్యాహ్నం మూడు గంటలకు తాడేపల్లి కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. గడప గడపకు ప్రభుత్వం సమీక్ష ఇదే చివరిది కావడంతో పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలకు ఇక ఛాన్స్ ఉండదని చెబుతున్నారు. దీంతో రేపటి సమావేశం కీలకంగా మారింది.
Next Story

