Sat Apr 04 2026 02:31:48 GMT+0530 (India Standard Time)
నేడు హైదరాబాద్ కు జగన్.. చాలా రోజుల తర్వాత?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు హైదరాబాద్ కు రానున్నారు. చాలా రోజుల తర్వాత జగన్ హైదరాబాద్ కు వస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు హైదరాబాద్ కు రానున్నారు. చాలా రోజుల తర్వాత జగన్ హైదరాబాద్ కు వస్తున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ తో చర్చించేందుకు పలుమార్లు జగన్ హైదరాబాద్ వచ్చారు. ఆ తర్వాత రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో హైదరాబాద్ రావడం మానుకున్నారు. లోటస్ పాండ్ కు జగన్ వచ్చి దాదాపు ఏడాదికి పైగానే అవుతుంది. హైదరాబాద్ లోని తన సొంత ఇంటికి కూడా జగన్ రావడం మానుకున్నారు.
వివాహ వేడుకకు...
ఈరోజు మాత్రం జగన్ హైదరాబాద్ వస్తున్నారు. జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ కుమారుడి వివాహ వేడుకల్లో జగన్ పాల్గొననున్నారు. లోటస్ పాండ్ కు వెళతారా? లేదా? అన్నది తెలియకున్నా, ఆయన వివాహ వేడుకల్లో పాల్గొన్న అనంతరం తిరిగి తాడేపల్లి వెళతారని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.
Next Story

