Thu Mar 19 2026 17:51:35 GMT+0530 (India Standard Time)
నేడు గడప గడపకు ప్రభుత్వంపై జగన్ సమీక్ష
ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష చేయనున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల కు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఈ సమీక్ష చేయనున్నారు. ఈ సమీక్షకు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు పార్టీ ఇన్ ఛార్జులు కూడా హాజరుకానున్నారు.
ప్రతి నెల...
ప్రతి నెల ముఖ్యమంత్రి జగన్ గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్ ఎమ్మెల్యేలను, మంత్రులను, పార్టీ ఇన్ ఛార్జిలను ప్రజల ముందుకు వెళ్లేలా గడప గడపకు కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమం అమలు తీరుపై జగన్ సీరియస్ గా ఉన్నారు. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ సమీక్షలు నిర్వహిస్తున్నారు.
Next Story

