Thu Mar 19 2026 04:28:49 GMT+0530 (India Standard Time)
కడపకు చేరుకున్న జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప జిల్లాకు చేరుకున్నారు. ఆయనకు వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప జిల్లాకు చేరుకున్నారు. ఆయనకు వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. కడప విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో పుష్పగిరి కంటి ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో దిగిన జగన్ కు జిల్లా అధికారులతో పాటు మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి, కడప నగర మేయర్ సురేష్ స్వాగతం పలికారు.
సాయంత్రం....
కంటి ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం జగన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంజాద్ భాషా కుమార్తె వివాహానికి హాజరవుతున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు జగన్ విశాఖకు చేరుకోవాల్సి ఉంది. అక్కడ రాష్ట్రపతికి స్వాగతం పలకాల్సి ఉంది. కడప పర్యటన సందర్బంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

