Thu Mar 19 2026 15:59:03 GMT+0530 (India Standard Time)
నేడు కడప జిల్లాకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కడప జిల్లా పర్యటనకు వెళుతున్నారు. ఆయన మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటిస్తారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కడప జిల్లా పర్యటనకు వెళుతున్నారు. ఆయన మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటిస్తారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి 3.20 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరకుంటారు. అక్కడి నుంచి 3.50 గంటలకు వేముల మండలం లోని వేల్పలు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ కొద్దిసేపు స్థానిక వైసీపీ నాయకులతో మాట్లాడతారు.
ఇడుపాయలో బస...
అనంతరం వేల్పుల గ్రామంలో సచివాలయం కాంప్లెక్స్ ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి సాయంత్రం 5.35 గంటలకు హెలికాప్టర్ లో వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ గెస్ట్‌హౌస్ కు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
Next Story

