Tue Mar 31 2026 09:37:09 GMT+0530 (India Standard Time)
వెల్లంపల్లిపై జగన్ సీరియస్?
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బంది కలిగించే విధంగా ఉన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. వెల్లంపల్లిని పిలిచి మాట్లాడాల్సిందిగా జగన్ సజ్జల రామకృష్ణారెడ్డిని ఆదేశించినట్లు సమాచారం. వెల్లంపల్లి వ్యాఖ్యలతో ఒక సామాజికవర్గం మనోభావాలు దెబ్బతినే అవకాశాలున్నాయని జగన్ అభిప్రాయపడటంతో ఆయనకు సీరియస్ వార్నింగ్ ఇచ్చేందుకు వైసీపీ అధినాయకత్వం సిద్ధమయింది.
సామాజికవర్గాన్ని....
వైసీపీ విజయవాడ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ పుట్టిన రోజు వేడుకలకు వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను హాజరయ్యారు. అయితే తనకు సమాచారం ఇవ్వకుండా తన నియోజకవర్గానికి చెందిన ఆకుల శ్రీనివాస్ ను జగన్ వద్దకు తీసుకెళ్లడంపై ఉదయభానుపై వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కాపు సామాజికవర్గంపై వెల్లంపల్లి చేసిన వ్యాఖ్యలు సీఎం జగన్ నోటీస్ కు వెళ్లడంతో ఆయన సీరియస్ అయినట్లు తెలిసింది.
Next Story

