Thu Jan 29 2026 04:30:45 GMT+0000 (Coordinated Universal Time)
నంద్యాలలో మంత్రులు లేని సభ
మంత్రులు రాజీనామా చేసిన తర్వాత తొలిసారి ఏపీ ముఖ్యమంత్రి జగన్ నంద్యాల బహిరంగ సభలో పాల్గొన్నారు

మంత్రులు రాజీనామా చేసిన తర్వాత తొలిసారి ఏపీ ముఖ్యమంత్రి జగన్ నంద్యాల బహిరంగ సభలో పాల్గొన్నారు. జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించి ఆయన నిధులు విడుదల చేశారు. గతంలో ఇటువంటి కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొనే వారు. సంబంధిత శాఖల మంత్రులతో పాటు జిల్లాకు చెందిన మంత్రులు, ఇన్ ఛార్జి మంత్రులు ఆ కార్యక్రమాల్లో పాల్గొనే వారు. కానీ ఒకరోజులోనే సీన్ మారింది.
ఇన్ ఛార్జి మంత్రి కూడా.....
నంద్యాలలో జరిగిన బహిరంగ సభలో మొన్నటి వరకూ మంత్రులుగా ఉన్న వారెవ్వరూ హాజరు కాలేదు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తో పాటు మిగిలిన మాజీ మంత్రులు దూరంగా ఉండటం కన్పించింది. మంత్రి పదవులకు రాజీనామా చేయడంతో ఇన్ ఛార్జి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా నంద్యాల సభకు దూరంగా ఉన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి గుమ్మనూరి జయరాం మాత్రం నంద్యాల సభకు హాజరయ్యారు.
Next Story

