Sun Mar 15 2026 13:27:11 GMT+0530 (India Standard Time)
తాము ఏ కూటమిలో లేము.. ప్రజా కూటమే
వైసీపీ ఏ కూటమిలో లేదని, ప్రజా సమస్యలపై పార్లమెంటు లో పోరాడాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ కోరారు.

వైసీపీ ఏ కూటమిలో లేదని, ప్రజా సమస్యలపై పార్లమెంటు లో పోరాడాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ కోరారు. వైసీపీ ఎంపీలతో్ జగన్ సమావేశమయ్యారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్న అన్యాయాన్ని ఉభయ సభల్లో ప్రస్తావించాలని నిర్ణయించుకున్నామని విజయసాయిరెడ్డి సమావేశం అనంతరం తెలిపారు.
రాష్ట్ర ప్రయోజనాలను.....
22,948 కోట్ల రిసోర్స్ గ్యాప్ ను పూడ్చాలని కేంద్రాన్ని కోరతామని విజయసాయిరెడ్డి చెప్పారు. ప్రత్యేక హోదా అంశంతో పాటు పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వంటి అంశాలను పార్లమెంటు ఉభయసభల్లో ప్రస్తావిస్తామని ఆయన తెలిపారు. రానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాలను సాధించే దిశగా తమ ప్రయత్నాలుంటాయని ఆయన తెలిపారు.
Next Story

