Mon Mar 16 2026 05:30:25 GMT+0530 (India Standard Time)
అభివృద్ధిని విపక్షాలు అడ్డుకుంటున్నాయి
కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందకుండా ప్రతిపక్షాలు కేసుల ద్వారా అడ్డుకుంటున్నాయని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందకుండా ప్రతిపక్షాలు కేసుల ద్వారా అడ్డుకుంటున్నాయని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రుణాలు అందకుండా కోర్టుల ద్వారా ప్రయత్నిస్తున్నాయని జగన్ అన్నారు. రోడ్డు, భవనాల శాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. రోడ్ల మరమ్మత్తులు, కొత్త రోడ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు.
వెంటనే పూర్తి చేయాలి....
ప్రధానంగా వంతెనలు, ఆర్ఓబీలను వెంటనే పూర్తి చేయాలని అధికారులను జగన్ కోరరాు. తుపాను బాధిత ప్రాంతాల్లో వెంటనే ఈ పనులు చేపట్టాలని సూచించారు. ఇందుకు వారికి కొంత సమయమిచ్చారు. జులై 15వ తేదీ నాటికి రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చాలని, 20వ తేదీన ఫొటో గ్యాలరీ పెట్టాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులు జగకుండా విపక్షాలు అన్ని మార్గాల ద్వారా అడ్డుకుంటున్నాయని ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు.
Next Story

