Mon Feb 02 2026 06:15:23 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కు నేరుగా వైసీపీ కౌన్సిలర్ విన్నపం... నన్ను రక్షించమంటూ?
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు వైసీపీ కౌన్సిలర్ వీడియోను పంపారు. తనను సీఐ బారి నుంచి రక్షించాలని జగన్ ను ఆమె వేడుకున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు వైసీపీ కౌన్సిలర్ వీడియోను పంపారు. తనను సీఐ బారి నుంచి రక్షించాలని జగన్ ను ఆమె వేడుకున్నారు. చీరాలలో ఐదో వార్డుకు చెందిన సూరగాని లక్ష్మి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చీరాల వన్ టౌన్ సీఐ రాజమోహన్ తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆ వీడియోలో పేర్కొన్నారు. చీరాలలో తన భర్త బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారని, డిసెంబరు 31వ తేదీ రాత్రి రెస్టారెంట్ పై దాడి చేసి తన భర్తను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి వేధించాడని ఆమె పేర్కొన్నారు.
కేసు పెట్టినందుకు....
దీనిపై కేసు పెట్టినందుకు తనను కూడా సీఐ రాజమోహన్ వేధిస్తున్నాడని తెలిపింది. తమను వ్యాపారం చేసుకోనివ్వకుండా బెదిరిస్తున్నారని పేర్కొంది. సీఐ బారి నుంచి తమ కుటుంబాన్ని కాపాడాలంటూ ఆమె నేరుగా ముఖ్యమంత్రి జగన్ ను కోరింది. అయితే సీఐ మాత్రం ఇవన్నీ అసత్యాలేనని, తాను ఎవరిపైనా దాడి చేయలేదని పేర్కొన్నారు.
Next Story

