Sat Mar 07 2026 17:43:32 GMT+0530 (India Standard Time)
నేడు ఏపీ మంత్రి వర్గ సమావేశం
ఏపీ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

ఆంధ్రప్రదేవ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తం 32 అంశాలతో సమావేశానికి అజెండాను రూపొందించారు. పలు కీలక అంశాలకు జగన్ మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపే అవకాశముంది.
పీఆర్సీపై....
దీంతో పాటు పీఆర్సీపై జరుగుతున్న రచ్చ, ఉద్యోగుల సమ్మె అంశంపై కూడా మంత్రి వర్గ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది. ఈ సందర్భంగా పలు ఆర్డినెన్స్ లకు ఆమోద ముద్ర పడే అవకాశముంది. మరోవైపు కరోనా థర్డ్ వేవ్, కోవిడ్ ఆంక్షలపై కూడా మంత్రి వర్గ సమావేశంలో చర్చించనున్నారు.
Next Story

