Fri Dec 05 2025 18:29:23 GMT+0000 (Coordinated Universal Time)
Ap Cabinet : నేడు మంత్రివర్గం సమావేశం.. కీలక అంశాలకు ఆమోదం
ఏపీ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. వైఎస్ జగన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. వైఎస్ జగన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో దాదాపు పంధొమ్మిది వేల కోట్ల రూపాయలకు సంబంధించి పారిశ్రామిక పెట్టుబడులకు ఆమోదముద్ర వేయనుంది.
అనేక అంశాలపై...
దీంతో పాటు వైఎస్సార్ సున్నా వండీ పంట రుణాలు, కల్యాణమస్తు, షాదీతోఫా, జగనన్న విద్యా దీవెన వంటి పథకాలకు మూడో విడత కేబినెట్ ఆమోదముద్ర పడనుంది. గ్రూప్ వన్, గ్రూప్ 2 ఖాళీల భర్తీ, విజయనగరం జిల్లా కంకటాలపల్లిలో రైలు ప్రమాద ఘటన, జగనన్న ఆరోగ్య సురక్ష అదితర అంశాలపై చర్చించనున్నారు. అనధికారికంగా చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై విడుదలయిన అనంతరం జరుగుతున్న పరిణామాలపై కూడా కేబినెట్ చర్చించనుంది. విశాఖ నుంచి జగన్ డిసెంబరు నెలలో పాలన సాగిస్తారన్న ప్రజలకు ఇచ్చిన హామీపైనా ఈ సమావేశంలో చర్చ జరగనుందని తెలిసింది.
Next Story

