Thu Mar 19 2026 14:45:25 GMT+0530 (India Standard Time)
ఏపీ కేబినెట్ భేటీ వాయిదా
మంత్రి గౌతమ్ రెడ్డి మరణానికి ముందే మార్చి3వ తేదీన కేబినెట్ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దుబాయ్ పర్యటన..

అమరావతి : ఏపీ మంత్రి వర్గ సమావేశం వాయిదా పడింది. మార్చి 3వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ జరగాల్సి ఉంది. కానీ.. అదే రోజు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పెద్దకర్మ ఉండటంతో.. కేబినెట్ భేటీని వాయిదా వేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం రోజు.. అంటే మార్చి 7వ తేదీనే కేబినెట్ భేటీ కూడా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read : రష్యా బాంబు దాడిలో భారత విద్యార్థి మృతి
మంత్రి గౌతమ్ రెడ్డి మరణానికి ముందే మార్చి3వ తేదీన కేబినెట్ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దుబాయ్ పర్యటన ముగించుకుని వచ్చిన మంత్రి గౌతమ్ రెడ్డి ఫిబ్రవరి 21న గుండెపోటు కారణంగా హఠాన్మరణం చెందారు. ఆ తర్వాత మంత్రి మృతికి సంతాపంగా రెండ్రోజులపాటు సంతాప దినాలు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఫిబ్రవరి 23న ప్రభుత్వ అధికార లాంఛనాలతో మంత్రి అంత్యక్రియలు ముగిశాయి.
Next Story

