Thu Jul 07 2022 07:57:27 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. వివిధ అంశాలను ఇప్పటికే అజెండాలో చేర్చారు. ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం సెక్రటేరియట్ లో ప్రారంభం కనానుంది. ఈ నెల 27వ తేదీన అమ్మవొడి పథకం నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అంతే కాకుండా ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో బైజూస్ తో కదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎనిమిదో తరగతి విద్యార్థులకు ల్యాప్ ట్యాప్ లు పంపిణీ చేసే కార్యక్రమంపై చర్చించే అవకాశం కన్పిస్తుంది.
జడ్పీ ఛైర్మన్ల బాధ్యతలను....
మరోవైపు ఉమ్మడి జిల్లాల జడ్పీ ఛైర్మన్ల పదవీ కాలం పూర్తయ్యేంత వరకూ కొత్త జిల్లాలకు కూడా వారి బాధ్యతలను వర్తింప చేసేలా చట్ట సవరణపై చర్చించి ఆమోదించనున్నారు. దేవాలయ భూముల ఆక్రమణల నిరోధానికి కూడా చట్ట సవరణపై ఏపీ కేబినెట్ చర్చించనుంది. దీంతో పాటు పంచాయతీ రాజ్ చట్టంలో అనేక సవరణలకు మంత్రి మండలి ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల దుబాయ్ పర్యటన సందర్భంగా వివిధ పరిశ్రమలతో చేసుకున్న ఒప్పందాలపై కూడా కేబినెట్ చర్చించనుంది.
Next Story