Thu Jan 23 2025 11:45:42 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఏపీ కేబినెట్ సమావేశం
మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో దేవాదాయశాఖలో 2 లక్షల ఎకరాల
తాడేపల్లి : ఏపీలో కొత్త మంత్రివర్గం కొలువుదీరిన తర్వాత తొలిసారి కేబినెట్ భేటీ జరగనుంది. నేడు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. నిజానికి ఈ సమావేశం రేపు జరగాల్సి ఉండగా.. ఒకరోజు ముందే నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో దేవాదాయశాఖలో 2 లక్షల ఎకరాల ఆక్రమణలకు సంబంధించిన అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఆడపిల్లలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కేబినెట్ భేటీ చర్చించనున్నట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టంలో చేయాల్సిన సవరణలను పునః సమీక్షించి కేంద్రానికి పంపనున్నట్లు సమాచారం. ప్రభుత్వ పథకాలపై ప్రజల నుంచి వస్తున్న స్పందన గురించి జగన్ మంత్రులను అడిగి తెలుసుకోనున్నారు.
.
Next Story