Sat Dec 06 2025 09:45:28 GMT+0000 (Coordinated Universal Time)
బీజేపీ, జనసేనలదే అధికారం
మైండ్ గేమ్ రాజకీయాలకు భారతీయ జనతా పార్టీ చెక్ పెడుతుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

మైండ్ గేమ్ రాజకీయాలకు భారతీయ జనతా పార్టీ చెక్ పెడుతుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. తాము మైండ్ గేమ్ రాజకీయాలకు చెక్ పెడతామని చెప్పారు. నిన్న పవన్ కల్యాణ్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ మైండ్ గేమ్ రాజకీయాలు ఏపీలో మొదలయ్యాయని అన్నారు.
మైండ్ గేమ్ కు....
దీనిపై దాని మిత్రపక్షమైన బీజేపీ నేత సోము వీర్రాజు స్పందించారు. బీజేపీ, జనసేనలు ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తాయని చెప్పారు. ఏపీని అభివృద్ధి చేయాలంటే అది బీజేపీ, జనసేనకే సాధ్యమన్నారు. విభజనతో ఏపీ అన్ని విధాలుగా నష్టపోయిందని, దానిని సరిదిద్దే కార్యక్రమాన్ని తాము చేపడతామని సోము వీర్రాజు తెలిపారు.
- Tags
- somu veerraju
- bjp
Next Story

