Fri Oct 11 2024 09:14:23 GMT+0000 (Coordinated Universal Time)
21నుంచి అసెంబ్లీ సమావేశాలు
ఈ నెల 21నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నెల 21నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 21వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు శాసనసభ, పది గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏపీ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఇప్పటి వరకూ జరగకపోవడంతో ఈ నెలలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
బాబు అరెస్ట్ తర్వాత...
ఈ సమావేశంలో కీలక బిల్లులను ఉభయ సభలను ఆమోదించే అవకాశాలు కన్పిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనేది కూడా బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో నిర్ణయించనున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయని తెలిసింది. ఈ సమావేశాలు హాట్ హాట్ గా జరగున్నాయి. చంద్రబాబు అరెస్ట్ అనంతరం అసెంబ్లీ సమావేశాలు జరగనుండటంతో ఈ అంశం సభలో ప్రధానంగా చర్చకు రానుంది. అధికార పక్షం దీనిపై పూర్తిగా వివరణ ఇవ్వనుంది. అలాగే విపక్షం కూడా చంద్రబాబు అరెస్ట్ అంశంపై తన నిరసనను తెలియ చేసే అవకాశాలున్నాయి.
Next Story