Thu Mar 19 2026 01:41:35 GMT+0530 (India Standard Time)
నేడు శ్రీకాకుళంలో ప్రాంతీయ సదస్సు
ఏపీ అమరావతి జేఏసీ నేడు శ్రీకాకుళంలో ఉద్యోగుల ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తుంది

ఏపీ అమరావతి జేఏసీ నేడు శ్రీకాకుళంలో ఉద్యోగుల ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తుంది. దాదాపు రెండు నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమం చేస్తున్నారు. అయినా ప్రభుత్వం స్పందించలేదని ఏపీ జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. 96 సంఘాలలో ఉన్న ఉద్యోగులతో శ్రీకాకుళంలో నేడు భారీ ప్రాంతీయ సదస్సు జరగనుంది. సిక్కోలు ఉద్యమ స్ఫూర్తితో శ్రీకాకుళంలో ఈరోజు ఉద్యోగులు కదం తొక్కనున్నారు.
96 ఉద్యోగ సంఘాలతో...
ప్రాంతీయ సదస్సుకు గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ అసోసియేషన్ తో పాటు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ ఉద్యోగులు కూడా పాల్గొంంటున్నారు. ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుండి ఉద్యోగులు శ్రీకాకుళం చేరుకున్నారు. ఈరోజు శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో అమరావతి ప్రాంతీయ సదస్సు జరగనుందని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించేంత వరకూ పోరాటం తప్పదని హెచ్చరించారు.
Next Story

