Thu Mar 19 2026 12:56:39 GMT+0530 (India Standard Time)
జీతాలు కూడా చెల్లించలేని స్థితి : బొప్పరాజు
రాష్ట్రంలో జీతభత్యాలు సమయానికి ఇచ్చే పరిస్థితి లేదని ఏపీ అమరాతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు

రాష్ట్రంలో జీతభత్యాలు సమయానికి ఇచ్చే పరిస్థితి లేదని ఏపీ అమరాతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఉద్యోగులతో చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వం ఉల్లంఘించిందన్న ఆయన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని అన్నారు. సీపీఎస్, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ హామీ ఏమైంది? అని ొప్పరాజు ప్రశ్నించారు.
అక్రమ కేసులు పెట్టి..
ఉద్యమం చేస్తున్న ఉపాధ్యాయులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. రేపు కలెక్టర్లకు తమ సమస్యలపై వినతిపత్రాలు సమర్పిస్తామని తెలిపారు. మూడో దశ ఉద్యమాన్ని శ్రీకాకుళం నుంచి ప్రారంభిస్తాంమని చెప్పిన బొప్పరాజు ఈ నెల 9న శ్రీకాకుళంలో ఉద్యోగుల ఆత్మీయ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. సొంత ప్యానల్ వేసుకోలేని వెంకట్రామిరెడ్డి తమపై విమర్శలు చేయడం మానుకోవాలని బొప్పరాజు హితవు పలికారు.
Next Story

